Vivek Ramaswamy: ఒహాయో గవర్నర్ పోటీకి సిద్ధమైన వివేక్ రామస్వామి

భారత సంతతి అమెరికన్, సిన్సినాటిలో జన్మించిన బయోటెక్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) ( 39) ఒహాయో(Governor) గవర్నర్ (Governor )గా పోటీ చేసేందుకు సర్వసన్నద్ధమయ్యారు. ఆయన తన ప్రచారాన్ని సిన్సినాటి (Cincinnati)లో ప్రారంభించనున్నారు. ఒహాయో అటార్నీ జనరల్ దవే యోస్ట్ (Dave Yost) కూడా ఈ పదవికి పోటీ పడుతున్నట్లు జనవరిలో ప్రకటించారు. అపలాచియాకు చెందిన నల్లజాతి పారిశ్రామికవేత్త హీథర్ హిల్ (Heather Hill), వైద్య విభాగం మాజీ డైరెక్టర్ ఎమీ ఏక్షన్ (డెమోక్రాట్) గవర్నర్ పదవి బరిలో దిగుతున్నారు.