ఆ అవకాశం తనకుగానీ.. కమలా కహారిస్ కు గానీ దక్కవచ్చు
2024లో అమెరికా అధ్యక్ష స్థానంలో ఓ మహిళ ఉండబోతున్నారు. ఆ అవకాశం తనకు గానీ, కమలా కహారిస్కు గానీ దక్కవచ్చు అని రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్‌తో పోటీపడుతున్న నిక్కీహేలీ తెలిపారు. నిక్కీ హేలీతో పాటు డెమొక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ కూడా భారతీయ మూలాలున్న మహిళ అన్న సంగతి తెలిసిందే. నేను ట్రంప్‌నకు రెండుసార్లు ఓటు వేశా. ఆయన పరిపాలనలో ఐక్యరాజ్య సమితి రాబయారిగా పనిచేయడం నాకు గర్వకారణం. కానీ ట్రంప్ వ్యవహారం గందరగోళంగా ఉంటుంది. దేశాన్ని మరో సారి ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్లదలచుకోవట్లేదు. ట్రంప్ ఎన్నికల్లో గెలవలేరు. కోర్టు కేసులో ఆయన కూరుకుపోయారు అని విమర్శించారు.






