Biden :బైడెన్ నిర్ణయాన్ని రద్దు చేయాలి .. రిపబ్లికన్ సెనేటర్ల తీర్మానం

అమెరికాలో ఇటీవల 540 రోజులకు పెంచిన వర్క్ పర్మిట్ గడువును తిరిగి 180 రోజులకే పరిమితం చేయాలని కోరుతూ రిపబ్లికన్ సెనేటర్లు (Republican Senators) ఇద్దరు తీర్మానం ప్రవేశపెట్టారు. వర్క్ పర్మిట్ నిబంధన ప్రవాసులకు, శరణార్థులకు, గ్రీన్‌కార్డు(Green card) ఉన్నవారికి, హెచ్-1బి (H-1B visa)వీసాదారుల జీవిత భాగస్వాములకు వర్తిస్తుంది. గతంలో 180 రోజులకే పరిమితమైన వర్క్ పర్మిట్ గడువును బైడెన్ (Biden) ప్రభుత్వం జనవరి 13న 540 రోజులకు పెంచింది. బైడెన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా వలసదారులు 540 రోజుల పాటు పోలీసుల సమక్షంలోకి రాకుండా దేశంలో ఉండేందుకు అవకాశం ఏర్పడిరది, ఇది ప్రమాదకంర అని సెనేటర్ జాన్ కెన్నడీ అన్నారు.