Donald Trump : మూడోసారి అధ్యక్షుడు కావడానికి మార్గాలున్నాయ్

అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి మార్గాలున్నాయని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. తాను మూడోసారి (Third time) బాధ్యతలు చేపట్టడాన్ని ఆయన తోసిపుచ్చలేదు. ఈ విషయంలో తాను జోక్ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డ్డారు. ఈ సందర్భంగా మీడియా (Media)తో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. చాలా మంది ప్రజలు (People) మూడోసారి ఎన్నిక కావాలని నన్ను కోరుతున్నారు. అయితే దానికి ఇంకా చాలా సమయముందని వారికి చెప్పా. దానిపై ఆలోచించడం తొందపాటు అవుతుందని మీక్కుడా తెలుసు. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించా అని ట్రంప్ పేర్కొన్నారు. మూడోసారి అధికారం చేపడతారా అని ప్రశ్నించగా తను పని చేయడం ఇష్టమని తెలిపారు.