జిమ్ జోర్డాన్ కు డొనాల్డ్ ట్రంప్ మద్దతు
అమెరికా ప్రతినిధుల సభకు కొత్త స్పీకర్గా ఒహైయో రాష్ట్రానికి చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు జిమ్ జోర్డాన్ ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ న్యాయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు పలికారు. జోర్డాన్ గొప్ప స్పీకర్గా నిలిచిపోతారనీ, ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని ట్రంప్ ప్రకటించారు. స్పీకర్ పదవి నుంచి కెవిన్ మెకార్టీ ఇటీవలే ఉద్వాసనకు గురైన సంగతి తెలిసిందే. ఆ స్థానానికి ప్రస్తుతం జోర్డాన్, లూసియానా రాష్ట్ర రిపబ్లికన్ సభ్యుడు స్టీవ్ స్కలీస్ పోటీపడుతున్నారు.






