అభ్యర్థిత్వ పోటీలో జో బైడెన్ విజయం
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ డెమోక్రాటిక్ పార్టీ ప్రైమరీ పోటీలో అధ్యక్షులు జో బైడెన్ విజయం సాధించారు. న్యూహాంప్‌షైర్ రాష్ట్రంలో పార్టీ ప్రతినిధులు ఆయనను తమ పార్టీ తరపున అభ్యర్థిగా మెజార్టీ బలంతో ఎంచుకున్నారు. ఇద్దరు పోటీదార్లు డీన్ ఫిలిప్, రచయిత మెరియనె విలియం సన్, ఇతర అనామకులను ఓడిరచారు. ఇప్పటికైతే ప్రెసిడెంట్ బైడెన్ తాను తిరగి పార్టీ తరపున అధ్యక్ష బరిలో ఉంటానని అధికారికంగా ప్రకటించలేదు. కానీ పలు రాష్ట్రాలలో పార్టీ ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు వ్యక్తం చేస్తున్న వైనం ప్రైమరీ ఎన్నికలలో కనబడుతోంది. ఫిబ్రవరి 3న అత్యంత కీలకమైన సౌత్ కరోలినాలో ప్రైమరీ పోటీ జరుగుతుంది.






