Obama : ఒబామా దంపతుల విడాకులపై .. స్పందించిన మిషెల్ టీమ్!

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama )దంపతులు విడాకులు తీసుకోనున్నారని వస్తున్న వార్తలపై మిషెల్ టీమ్ (Michelle Team) స్పందించింది. వారి వైవాహిక జీవితంపై నిరాధార వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరింది. ఒబామా దంపతులు విడాకులు తీసుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదని వెల్లడిరచింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమాణ స్వీకారానికి మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరవుతున్నారని తెలిపింది. అయితే ట్రంప్ వ్యవహార శైలి, గతంలో ఒబామా కుటుంబాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు, జాతి ఆధారంగా చేసే విమర్శలు, మిషెల్ (Michelle ) నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. అందువల్లే ఆ కార్యక్రమానికి ఆమె దూరంగా ఉంటున్నారని టీమ్ వెల్లడిరచింది. ట్రంప్ వ్యాఖ్యలను మిషెల్ తీవ్రంగా పరిగణించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆయనను తాను ఎప్పటికీ క్షమించనని తెలిపినట్లు పేర్కొన్నాయి. ఇటీవల మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ (Jimmy Carter) అంత్యక్రియలు జరిగిన సమయంలో ఆమె మరో ప్రాంతంలో ఉన్నందువల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని తెలిపింది.