అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి తాను సిద్ధమే : కమలా హారిస్
అమెరికా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధమేనని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపకశక్తి, వయసుపై తీవ్ర విమర్శలు వస్తోన్న వేళ ఆమె స్పందన ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఏదైనా అనూహ్య పరిస్థితిలో ఆ పదవి ఉంచి దిగిపోవాల్సి వస్తే, ఉపాధ్యక్ష పదవిలో ఉన్నవారు ఆ బాధ్యత చేపడతారు. అలా చూస్తే హారిస్ కే ఆ బాధ్యతలు దక్కుతాయి. అయితే, ఆ బాధ్యతలు చేపట్టే విషయంలో ఆమె సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలను తోసిపుచుతూ నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్దంగా ఉన్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. నన్ను గమనించిన ప్రతి ఒక్కరికీ నా సామర్థ్యం గురించి తెలుసు అని బదులిచ్చారు.






