అప్పట్లో నాకు వివాహేతర సంబంధం ఉండేది.. కమలా హారిస్ భర్త
మొదటి వివాహ సమయంలో తనకు వివాహేతర సంబంధం ఉండేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్హోప్ అంగీకరించారు. తన పిల్లలు చదివే పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయురాలితో ఎమ్హోప్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని అందువల్లే ఆయన మొదటి వివాహానికి తెరపడిరదని ఇటీవల వార్తలొచ్చాయి. వాటిపైన ఆయన స్పందించారు. నా మొదటి వివాహం తర్వాత నా చర్యలతో నేను, అప్పటి నా భార్య చాలా కఠిన సమయాన్ని ఎదుర్కొన్నాం. ఆమెను మోసం చేశాను. అందుకు నేను పూర్తి బాధ్యత వహించాను అని పేర్కొన్నారు. హారిస్, ఎమ్హోఫ్ 2014లో పెళ్లి చేసుకున్నారు. హారిస్‌కు ఇది మొదటి వివాహం కాగా, ఎమ్హోఫ్కు రెండోది. ఆయన వివాహేతర సంబంధం గురించి హారిస్‌కు ముందే తెలుసని సమాచారం.






