భారత్ మాకెంతో ముఖ్యమైన దేశం : అమెరికా
అమెరికాకు భారత్ ఎప్పుడూ ముఖ్యమైన దేశమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారని భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టీ తెలిపారు. ఇండియా స్పోరా జీ20 ఫోరమ్‌లో ఆయన మాట్లాడుతూ భారత్-అమెరికాల మధ్య సాంకేతిక, వాణిజ్యం, అంతరిక్షంతో సహా వివిధ రంగాల్లో సహకారం ఉంది. గతంలో నేను ఇక్కడకు (భారత్) పని చేయడానికి రావాలని బైడెన్‌ను కోరినప్పుడు భారత్ మాకెంతో ముఖ్యమైన దేశమని అన్నారు. అమెరికాలో పన్ను చెల్లించేవారిలో భారతీయ అమెరికన్లు ఆరు శాతం ఉన్నారు అని పేర్కొన్నారు. టెక్నాలజీ సహకారం, పంపిణీ వ్యవస్థలు, పర్యావరణం, అంతరిక్షం, సముద్ర అధ్యయనం తదితర అంశాల్లో కలిసి పనిచేసేలా సహకారం పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టిందన్నారు. అమెరికా, భారత్‌లను ప్రపంచంలోనే రెండు శక్తిమంతమైన శక్తులుగా అభివర్ణించారు.






