జిమ్ జోర్డాన్ కు మళ్లీ నిరాశ
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ పదవికి నిర్వహించిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన జిమ్ జోర్డాన్ మూడోసారి విజయం సాధించలేకపోయారు. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత మిత్రుడైన జోర్డాన్‌ను మరింత ఎక్కువమంది రిపబ్లికన్లను తిరస్కరించారు. మొత్తంగా 25 మంది రిపబ్లికన్లును కోల్పోయిన జోర్డాన్ మెజారిటీకి చాలా దూరంలో ఉండిపోయారు. దీంతో రిపబ్లికన్ పార్టీ అయన్ను నామినీగా సైతం ఉపసంహరించింది. మరోవైపు ఓటింగ్ సందర్భంగా కేపిటల్ భవనం వద్ద జోర్డాన్ మీడియాతో మాట్లాడుతూ అమెరికా ప్రజలు మార్పుకోసం చాలా ఉత్సుకతతో ఉన్నారు అని వ్యాఖ్యానించడం గమనార్హం.






