స్పీకర్ గా డొనాల్డ్ ట్రంప్ ?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పీకర్ పదవిని చేపట్టాలని రిపబ్లికన్ పార్టీలో కొందరు విజప్తి చేశారు. జోర్డాన్, స్కలీస్లలో ఎవరికీ మెజారిటీ రాకపోతే ట్రంపే తాత్కాలికంగా స్పీకర్ పదవి చేపడతారని టెక్సాస్ కాంగ్రెస్ సభ్యుడు ట్రాయ్ నెల్స్ పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నికకు ఓటింగ్ జరిగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులను కలవడానికి తాను వాషింగ్టన్ వెళ్లనున్నట్లు ట్రంప్ తెలియజేశారు. జోర్డాన్, స్కలీస్లలో ఎవరికీ స్పష్టమైన మెజారీటీ రాకపోతే 30 నుంచి 90 రోజులపాటు స్పీకర్ పదవి చేపట్టడానికి తాను సిద్దమని ట్రంప్ ప్రకటించారు.






