జో బైడెన్ మంత్రివర్గంలో వివేక్, మజుందార్!
అమెరికా 46వ దేశాధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే బైడెన్ ఏర్పాటు చేయబోయే మంత్రివర్గంలోకి ఇద్దరు భారతీయ అమెరికన్లకు చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఎన్నికల వేళ బైడెన్‌కు అడ్వైజర్‌గా పనిచేసిన వివేక్ మూర్తికి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీస్ మంత్రిగా వివేక్‌ను బైడెన్ నియమించే అవకాశాలు ఉన్నాయి. ఇక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అరుణ్ మజుందార్‌కు.. ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నట్లు కొన్ని కథనాలు వెల్లడిస్తున్నాయి.
బైడెన్ టీమ్‌కు సంబంధించి లిస్టును ఓ మీడియా సంస్థ రిలీజ్ చేసింది. 43 ఏళ్ల వివేక్ మూర్తి ప్రస్తుతం కోవిడ్ 19 సలహాదారుల బృందంలో ఉన్నారు. కరోనా వైరస్ విషయంలో ఆయన బైడెన్‌తో కలిసి పనిచేస్తున్నారు. స్టాన్‌ఫోర్డ్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రాఫెసర్‌గా చేసిన మజుందార్.. అక్కడే అడ్వాన్స్డ్ రీసర్చ్ ప్రాజెక్టస్ ఏజెన్సీ డైరక్టర్‌గా చేశారు. ఎనర్జీ సంబంధిత అంశాల్లో బైడెన్‌కు అడ్వైజర్‌గా చేశారు. తాజాగా ముగిసిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్.. జనవరి 20వ తేదీన దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.






