జో బైడెన్ ను ఓడించగలిగేది నిక్కీయే
వచ్చే ఏడాది నవంబరులో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ను ఓడించగల సత్తా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారు నిక్కీ హేలీకి మాత్రమే ఉందని ఓ సర్వే పేర్కొంది. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం అరడజను మందికి పైగా పోటీలో ఉన్నారు. వారిలో భారత సంతతి అమెరికావాసులైన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి కూడా ఉన్నారు. వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. అధ్యక్ష అభ్యర్థిత్వ పోటీదారుల్లో ఎవరితో బైడెన్ పోటీ పడతారనేది ఇప్పటి వరకూ అస్పష్టంగా ఉంది. అయితే అధ్యక్ష ఎన్నికలకు సంబందించిన పోటీని పరిశీలిస్తే సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హెలీ బైడెన్ కంటే ముందున్నారు అని తాజా సర్వేలో వెల్లడించింది.






