ఆర్సీబీ దూకుడుకు అడ్డే లేదు, బలం ఇదేనా..!
ఒకప్పుడు “ఈ సారి కప్పు మనదే” (Ee Sala Cup Namde) అనే స్లోగన్‌తోనే సరిపెట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), ఇప్పుడు ఆ స్లోగన్‌ను మరోసారి నిజం చేసుకునే దిశగా.. మైదానంలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. 2025లో టైటిల్ గెలిచిన జోరును, 2026లో కూడా ఏమాత్రం తగ్గకుండా కొనసాగిస్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, సమష్టి ప్రదర్శనతో ఆర్సీబీ ‘అన్-స్టాపబుల్’ అనిపించుకుంటోంది. అసలు ఈ సీజన్లో ఆర్సీబీ దుమ్ము రేపడానికి గల కారణాలేంటి..? వారి బలాలేంటి..? అనేవి వివరంగా చూద్దాం.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ జాతకాన్ని మార్చిన ఘనత రజత్ పాటిదార్‌కే దక్కుతుంది. గతేడాది జట్టుకు టైటిల్ అందించిన అతను, ఈ ఏడాది మరింత పరిణతి చెందిన కెప్టెన్‌గా కనిపిస్తున్నాడు. కేవలం కెప్టెన్సీ మాత్రమే కాకుండా, కీలక సమయాల్లో బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 55.50 సగటుతో, 213కు పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించడం అతని ఫామ్‌కు నిదర్శనం. బౌలర్లను మార్చడంలో కానీ, ఫీల్డింగ్ సెటప్‌లో కానీ పాటిదార్ చూపిస్తున్న చొరవ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అంటేనే ప్రత్యర్థి బౌలర్లకు పీడకల. విరాట్ కోహ్లీ(Virat Kohli), రజత్ పాటిదార్, ఫిలిప్ సాల్ట్ లతో కూడిన టాప్ ఆర్డర్ ఈ లీగ్ లో అత్యంత ప్రమాదకరమైన టాప్ ఆర్డర్ గా మారింది. విరాట్ కోహ్లీ ఒకవైపు యాంకర్ పాత్ర పోషిస్తుంటే, మరోవైపు పాటిదార్, ఫిలిప్ సాల్ట్, పడిక్కల్, టిం డేవిడ్(Tim David) వంటి వాళ్ళు బౌండరీల వర్షం కురిపిస్తున్నారు. దీనివల్ల పవర్ ప్లేలోనే ఆర్సీబీ భారీ స్కోర్లకు పునాది వేస్తోంది. చాలా ఏళ్ల పాటు ఆర్సీబీని వేధించిన సమస్య బౌలింగ్. కానీ గత రెండు సీజనల నుంచి పరిస్థితి భిన్నంగా ఉంది.
భువనేశ్వర్ కుమార్, జాష్ హెజిల్ వుడ్ పవర్ ప్లేలో కొత్త బంతితో వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతున్నారు. గతంలో మిడిల్ ఓవర్లలో పరుగులు ధారాళంగా ఇచ్చేవారు. కానీ ఈసారి పెసర్లు, స్పిన్నర్లు పక్కా ప్లాన్‌తో బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. వికెట్లు తీయకపోయినా డాట్ బాల్స్ వేస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. జట్టులో ఎవరూ వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా, జట్టు విజయం కోసం ఆడుతున్నట్లు కనిపిస్తోంది. టిం డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్ వంటి ఫినిషర్లు తమకు వచ్చిన తక్కువ బంతుల్లోనే ఓ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. బెంచ్ మీద ఉన్న ఆటగాళ్లు కూడా ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండటం ఆర్సీబీ బలాన్ని పెంచుతోంది.
ఇవి కూడా చదవండి








