కోహ్లీ గాయంపై క్లారిటీ ఇచ్చిన ఆర్సీబీ కెప్టెన్..!
ముంబై ఇండియన్స్‌తో(MI) జరిగిన ఉత్కంఠభరిత పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) 18 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ఫీల్డింగ్‌కు రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్‌లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ క్లారిటీ ఇచ్చాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ చీలమండ వద్ద గాయంతో ఇబ్బంది పడ్డాడు.
టోర్నీ కీలక దశలో ఉన్నందున, గాయం తీవ్రత పెరగకూడదనే ఉద్దేశంతో మేనేజ్మెంట్ ఆయనను ఫీల్డింగ్‌కు పంపకుండా విశ్రాంతిని ఇచ్చింది. కోహ్లీ స్థానంలో యువ ఆటగాడు జాకబ్ బెథెల్ ఫీల్డింగ్ చేశారు. “గాయం గురించి నాకు ఇంకా పూర్తి వివరాలు తెలియవు, కానీ ప్రస్తుతం కోహ్లీ బాగానే ఉన్నాడని భావిస్తున్నాను” అని పాటిదార్ పేర్కొన్నాడు. విశేషమేమిటంటే, ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీకి తీవ్ర జ్వరం ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ, జట్టు కోసం బరిలోకి దిగిన కోహ్లీ.. 38 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టు 240 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదే క్రమంలో ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్‌పై 1,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రస్తుతానికి కోహ్లీ గాయం పెద్దది కాదని జట్టు వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 15న చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరగబోయే తర్వాతి మ్యాచ్‌కి కోహ్లీ.. అందుబాటులో ఉండవచ్చని పాటిదార్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్లో 179 పరుగులు చేసిన కోహ్లీ, ఆరెంజ్ క్యాప్ రేసులోనూ ముందంజలో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి








