తెలంగాణలో భారీగా పెరుగుతున్న కేసులు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‍లో రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసిది. రాష్ట్రంలో మొత్తం 3,87,106 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం 3,26,997 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1961 మంది కరోనా వైరస్‍తో మృతి చెందారు. రాష్ట్రంలో 58,148 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‍ఎంసీ పరిధిలో 1464, మేడ్చల్ 606, రంగారెడ్డిలో 504, నిజామాబాద్‍లో 486, ఖమ్మంలో 325, వరంగల్ అర్బన్‍లో 323, మహబూబ్‍నగర్‍లో 280 కరోనా కేసులు నమోదయ్యాయి.