Revanth Reddy: ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూ.. నిరంతరం సమస్యలంపరిష్కారం కోసం విరామం లేకుండా పనిచేసే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఇక్కడ అద్భుతంగా ఆడకపోవచ్చు.. కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఎల్బీ స్టేడియం వేదిక అవుతుంది. ఈ మైదానంలో శిక్షణ పొందిన వారు మంత్రివర్గంలో ఉన్నారు. క్రికెట్ లో దేశానికి వన్నె తెచ్చిన అజారుద్దీన్ మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడిన వాకిటి శ్రీహరి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత క్రీడా స్ఫూర్తి కరువైంది.
అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చాం. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సీఎం కప్ పోటీలను నిర్వహించాం. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలంపిక్స్ లో ఒక్క పతకంసాధించలేదు. 3 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది. సౌత్ కొరియా స్పోర్ట్స్ యినివర్సిటీకే 16 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది. విద్యార్థులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకుని రాణించండి. క్రీడా స్ఫూర్తిని నింపేందుకే ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చాం. దీనిపై ప్రతిపక్ష నాయకులు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారు.

ఫుల్ బాల్ దిగ్గజం హైదరాబాద్ కు వస్తే మన ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. కానీ ప్రతిపక్ష నాయకులు డ్రగ్ లాడ్ కింగ్ ను రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారో నాకు తెలియదు. ఫామ్ హౌస్ పార్టీలకు దూరంగా.. మత్తుకు దూరంగా ఉండాలని క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. ఎల్బీ స్టేడియం రాజకీయ కార్యకలాపాలకే పరిమితమైంది. ఎల్బీ స్టేడియంను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియం ను ప్రపంచ క్రీడా పోటీలు నిర్వహించేలా అభివృద్ధి చేయబోతున్నాం. బేగంపేట హాకీ క్రీడా మైదానాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. ఫుట్ బాల్ లో గతంలో దేశానికి మెడల్స్ తెచ్చిన ఏడుగురిలో 4 గురు మన ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. మళ్లీ ఆ స్థాయికి క్రీదా స్ఫూర్తిని నింపి క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించాం.
ఇవి కూడా చదవండి








