కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన.. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం
తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన లేదని స్పష్టం చేసింది. దీనిపై సీడబ్ల్యూసీ (CWC)కి వచ్చిన ప్రతిపాదనలు, డీపీఆర్ (DPR)ను వెనక్కి పంపినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టులో అంతరాష్ట్ర జలవివాద అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి (Renuka Chowdhury) అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్ చౌదరి (Rajbhushan Choudhary) లిఖిత పూర్వక సమాధానిచ్చారు.








