రెండేళ్ల తర్వాత తప్పకుండా మారుస్తారు : రామచందర్ రావు
పరిపాలనలో లోపంతోనే అధికారులపై ఆరోపణలు వస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు(Ramachandra Rao) విమర్శించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సల్కమ్ చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కోర్టులను కూడా అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. న్యాయస్థానాల ఆదేశాలున్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా చూస్తూ ఊరుకోం. క్యూర్ పై ఆగస్టు 15 తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహిస్తాం. ఆ తర్వాత ఉద్యమాలు చేస్తాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని రెండేళ్ల తర్వాత తప్పకుండా మారుస్తారు. ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ముగిసిన తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC elections) ఉంటాయని అనుకుంటున్నాం. ఇథనాల్‌తో వాహనాల ఇంజిన్లు పాడైపోతాయని ఇండియా కూటమి(India alliance) తప్పుడు ప్రచారం చేస్తోంది అని అన్నారు.








