కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ను కలిసిన టీడీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) టీడీపీ ఎంపీలతో ఉన్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు (Lavu Sri Krishnadevarayalu) నేతృత్వంలో ఎంపీలు పార్లమెంట్ భవనంలో అమిత్ షా ను కలిశారు. అమరావతి (Amaravati) నిర్మాణ పురోగతిపై రూపొందించిన కాఫీటేబుల్ బుక్‌ను ఆయనకు అందజేశారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను వివరించారు. ఆధునిక పరిస్థితులను అనుగుణంగా నిర్మిస్తున్న నగరానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా, చట్టపరంగా చేయÖతనందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) చేతుల మీదుగా పున ప్రారంభమైన నగర నిర్మాణంలో ఇప్పటివరకు సాధించిన పురోగతిని ఎంపీలు వివరించినప్పుడు అమిత్‌షా సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలు చింతకాయల విజయ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, బైరెడ్డి శబరి, సానా సతీష్, బీద మస్తాన్‌రావు, బీకే పార్థసారథి పాల్గొన్నారు.








