కళాశాల యాజమాన్యాలకు వైసీపీ బెదిరింపులు : బీటెక్ రవి
డీఎస్సీ (DSC )పై వైసీపీ నిర్వహించిన ర్యాలీలో ఆ పార్టీ కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు (College students) మాత్రమే ఉన్నారని తెలుగుదేశం పార్టీ పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి (B.Tech Ravi) అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ రాసిన విద్యార్థులు ఎవరూ ఆ ర్యాలీలో లేరని చెప్పారు. మైనర్ విద్యార్థులకు వైసీపీ కండువాలు వేసి ర్యాలీలు చేయడం బాధిస్తోందన్నారు. పులివెందులలో విద్యార్థులు ర్యాలీకి రాకపోతే కళాశాలలు నడపలేరంటూ కొందరు వైసీపీ నేతలు యాజమాన్యాలను బెదిరించారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ అవివాశ్ రెడ్డి (Avinash Reddy) ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో ఇలా చేయడమేంటని బీటెక్ రవి ప్రశ్నించారు.








