మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్
డీఎస్సీ (DSC)లో అక్రమాలు జరిగాయంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చింది. ఈ నిరసనల్లో పాల్గొనేందుకు అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్తున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy ), ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి (Ananth Venkata Rami Reddy)లను పోలీసులు ముచ్చుకోట వద్ద అడుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ నేతలు అక్కడే బైఠాయించారు. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డిలను అదుపులోకితీసుకుని పోలీసులు అనంతపురం తరలించారు.








