అలాంటి కంపెనీలకు వేల కోట్ల విలువైన భూమి? : కేటీఆర్ సంచలన ఆరోపణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోదరులంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులవుతున్నా రని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క ఉద్యోగి కూడా లేకుండా కొత్త కొత్త కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. సీఎం సోదరులు చిన్నచిన్న ఇంటి అడ్రస్‌లతో పెద్ద పెద్ద కంపెనీలు రిజిస్ట్రేషన్ చేయించారు. అలాంటి ఊరుపేరు లేని కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి కేటాయించింది. అనుముల కొండల్ రెడ్డి టెసరాక్ కంపెనీ (Tessarac Company) చైర్మన్ లింక్డిన్ ప్రొఫైల్‌లో పెట్టుకున్నారు. సీఎం మరో సోదరుడు జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) కాంట్రాక్టులు చేసుకుంటున్నారు. సీఎం బామ్మరి సృజనన్ రెడ్డి సింగరేణి (Singareni)లో కాంట్రాక్టు ఇచ్చారు అని ఆరోపించారు.








