దొంగ ఓటు వేసిన మున్సిపల్ చైర్పర్సన్
మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. తోటికోడలు పేరుతో నమోదైన ఓటును తన ఓటుగా తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న వేశారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన కలెక్టర్ ఆమె దొంగ ఓటు వేసినట్లు తేల్చారు. దీంతో స్వప్న రాజీనామా చేయాలని బల్దియా ఆఫీసు ఎదుట విపక్షాల ఆందోళనకు దిగాయి. చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటరు ఇంటి పేరు స్వప్న ఇంటి పేరు ఒకటే కావడంతో ఆమె ఎవరికి అనుమానం రాకుండా ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది.













