ఆ ప్రచారం నమ్మొద్దు : మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం క్రాప్ హాలిడే (Crop Holiday) ప్రకటించిందని ప్రచారం జరగుతున్న వేళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) దీనిపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి క్రాప్ హాలిడే ప్రకటన చేయలేదని, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని రైతులు (Farmers) నమ్మొద్దని స్పష్టం చేశారు. ఎల్ నినో ( ElNino) ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న విపత్తు అని పేర్కొన్నారు. ఎల్ నినో దృష్ట్యా ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రాయితీపై అందజేస్తున్నట్టు తెలిపారు. ఆరు నెలలుగా ఎన్ నినో రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, వారు నష్టపోకుండా ప్రభుత్వం అని చర్యలు చేపట్టిందని తెలిపారు.








