ఇది వరంగల్ ప్రజలకు శుభవార్త
ఐటీ దిగ్గజ కంపెనీ జెన్ ప్యాక్ట్ వరంగల్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇది వరంగల్ ప్రజలకు శుభవార్త అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం అనంతరం ఆ కంపెనీ సీఈవో త్యాగరాజన్ ఈ ప్రకటన చేయడం, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం ఎంతో సంతోషించదగ్గ విసయం అన్నారు. వరంగల్ లో ఇప్పటికే టెక్ మహీంద్రా, సయింట్ ఆఫీస్‌లు పెట్టగా తాజాగా జెన్ ప్యాక్ట్ రావడం వరంగల్ వాసులకు శుభవార్త అని అన్నారు.













