పాదయాత్ర అంటే ప్రజల కోసం చేయాలి… కానీ

బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేస్తున్న యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర కాదని దొంగ యాత్ర అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదయాత్ర అంటే ప్రజల సమస్యలను తెలుసుకొడానికి చేయాలని, కానీ అర్థం కాని పాదయాత్ర చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని అన్నారు. బీజేపీ ప్రభుత్వం మతం పేరు మీద రాజకీయం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఏనాడు దేవాలయాలకు నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు. కేవలం మెజార్టీ ఉన్న హిందువల ఓట్ల కోసం ఇరువర్గాల మధ్య రెచ్చగొట్టి మత రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు కానీ సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.