Etala Rajender: రక్త సంబంధం కన్నా..పార్టీ సంబంధం ఎంతో గొప్పది : ఎంపీ ఈటల
రక్త సంబంధం కన్నా పార్టీ సంబంధం ఎంతో గొప్పదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) అన్నారు. బీజేపీ (BJP) మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా (Malkajgiri Urban District) కార్యకర్తల శిక్షణ శిబిరంతో పాటు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమాన్ని మల్కాజిగిరిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాషాయ వర్గంలో ఒక కార్యకర్తకు ఆపద వస్తే మిగతా వారందరూ అండగా నిలుస్తారని ఆయన అన్నారు. ప్రజాసమస్యలపై కోట్లాడినప్పుడే ప్రజలకు, నాయకులకు మధ్య అనుబంధం ఏర్పడుతుందన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే భారతీయ జనతాపార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. పార్టీ బలోపేతం దిశగా నాయకులు, కార్యకర్తలు నిరంతరం శ్రమించాలని రాజేందర్ కోరారు.
ఇవి కూడా చదవండి








