శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసుల ఎదుట దేవరాజ్ లొంగుబాటు
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ మేరకు సీఐ నర్సింహారెడ్డి తెలిపారు. దేవరాజ్ వేధింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందన్న శ్రావణి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగా అతని స్టేట్ మెంట్‌ను పోలీసులు రికార్డు చేయనున్నారు. ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న కాల్ రికార్డ్స్‌ను పోలీసులకు సమర్పించనున్నట్లు దేవరాజు తెలిపాడు. దేవరాజ్‌ను విచారిస్తున్నామని, ఈ కేసులో సాయికృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తామని సీఐ తెలిపారు.













