KCR SIT Investigation: కొనసాగుతున్న విచారణ.. నందినగర్ వేదికగా ‘ట్యాపింగ్’ గుట్టు విప్పనున్న సిట్!
KCR SIT Investigation: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు నేడు ఆయన నివాసంలో విచారిస్తున్నారు.
నందినగర్ నివాసంలో ప్రశ్నల వర్షం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్‌లోని నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు కేటీఆర్ స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఐదుగురు ఉన్నతాధికారుల బృందం (డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయ్ కుమార్, నారాయణరెడ్డి తదితరులు) కేసీఆర్ నివాసానికి చేరుకుంది. ఇంటి రెండో అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో ఈ విచారణ జరుగుతోంది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని అధికారులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు.
కేసీఆర్ వెంట సంతోష్ రావు నియమ నిబంధనల ప్రకారం విచారణ సమయంలో కేసీఆర్ వెంట ఒకరు ఉండేందుకు అనుమతి లభించడంతో, మాజీ ఎంపీ సంతోష్ రావు ఆయన పక్కనే ఉన్నారు. కేటీఆర్ ఇంట్లోనే ఉండగా, హరీష్ రావు, ఇతర కీలక నేతలు తెలంగాణ భవన్లో ఉండి పరిస్థితిని గమనిస్తున్నారు.
సిట్ అడిగే కీలక ప్రశ్నలు ఇవే?
కేసీఆర్ తన వెంట కొన్ని ముఖ్యమైన పత్రాలు, నోట్ బుక్‌ను తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అధికారులు, ఇతర నేతలు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా సిట్ అధికారులు కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి నుండి వచ్చాయి?
ఈ వ్యవహారంలో కీలక పాత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావు నియామకం వెనుక ఉన్న కారణాలేంటి?
రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ జరిగిందా అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారంపై అధినేతను ప్రశ్నిస్తుండటంతో, ఈ కేసు దర్యాప్తు ఏ మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.






