Revanth Reddy: కేరళ ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి : సీఎం రేవంత్ రెడ్డి
ప్రధాని మోదీ (Modi), కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) కు తేడా ఏమీ లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముట్టతారలో నిర్వహించిన రోడ్ షో లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేరళ (Kerala) ప్రజలు తెలివైనవారు, విద్యావంతులు. ఇక్కడి ప్రజలు మతతత్వ శక్తులను అనుమతించరు. అలాంటి వారు అధికారంలోకి రాకుండా లక్ష్మణరేఖ గీశారు. కేరళకు భవిష్యత్తు లేకుండా చేయాలని మోదీ, పినరయి విజయన్ చూస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలవకూడదని ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఓటు బ్యాంకు పినరయికీ బదిలీ అయ్యేలా చేస్తున్నారు. ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి అని అన్నారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








