తెలంగాణలో ఆస్ట్రేలియా పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ, లైఫ్‌సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగాలకు అనేక అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతిభవన్‌లో ఆస్ట్రేలియా ఇండియా ఇన్‌స్టిట్యూట్ సీఈవో లీసా సింగ్‌తో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆస్ట్రేలియా వ్యాపార, వాణిజ్య వర్గాల సంబంధాల బలోపేతంపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా లీసా సింగ్ మాట్లాడుతూ దేశంలో వివిధ రంగాల్లో అత్యంత వేగంగా అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని అన్నారు. తెలంగాణలో ఆస్ట్రేలియా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. త్వరలోనే ఒక ప్రతినిధి బృందం భారత్‌లో పర్యటిస్తుందని తెలిపారు. తాము ఇప్పటికే తెలంగాణలో పలు విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలతో కలిసి పచేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులను అందిపుచ్చుకొనేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని ఆమెకు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ ప్రసిద్ధ సంస్థలు ఇక్కడ కార్యాలయాలన నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమలు, ఐటీశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.