5,000 మందికి టాటా!
దేశ టెలికం రంగంలో ఉద్యోగ భద్రత గాలిలో దీపముల మారిది. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు విలీనాలు, నిర్వహణ భారం నెపంతో వేల మందిని తొలగించాయి. తాజాగా టాటా టెలీసర్విసెస్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. టాటా సన్స్ గ్రూపునకు చెందిన టాటా టెలి సర్వీసెస్ (టిసిఎస్ఎల్)లో పని చేసే 5వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడానికి కసరత్తును ప్రారంభించినట్లు తెలుస్తోంది. వీరి తొలగింపునకు మూడు నుంచి ఆర్నెల్ల నోటీసు గడువు ఇవ్వనున్నారని సమాచారం. కాగా అంతకంటే ముందే సంస్థ వీడాలనుకున్న వారికి ప్యాకేజీలు ఇవ్వడంతో పాట, సీనియర్లకు స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్ఎస్) అవకాశాన్ని కల్పించనున్నారు. టిసిఎస్ఎల్ భారీ మొత్తంలో అప్పుల ఊబీలో చిక్కుకోవడంతో ఈ పరిస్థితి చోటు చేసుకుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.













