అఖిలప్రియకు వైసిపి ఝలక్: నంద్యాల అభ్యర్థిని ప్రకటించిన బంధువు
నంద్యాల ఉప ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యుడిని అభ్యర్థిగా నిలపడంతో పాటు, వైసిపితో చర్చలు జరిపి ఏకగ్రీవం చేసేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, మంత్రి అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసి కొట్టేలా కనిపిస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి తరఫున అఖిలప్రియ కుటుంబంతో పాటు, శిల్పా మోహన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు.








