తెలుగుదేశంలోకి గంగుల
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు గంగుల ప్రతాప రెడ్డి తెలుగుదేశంలో చేరడం దాదాపు ఖాయమైనట్టే. వెలగపూడి సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి గుంగులను టిడిపి అధినేత వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు గంగుల ప్రతాపరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల పర్యటనకు వస్తున్నందున ఆయన సమక్షంలో గంగుల తెలుగుదేశం పార్టీలో చేరతారని తెలిసింది.








