పవన్ అభిమన్యుడా.. లేక అర్జునుడా..
పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని ఏమని ప్రకటించారు కానీ.. అక్కడ రాజకీయ పరిస్థితులు మరింత హీట్ ఎక్కుతున్నాయి. వైసీపీ పూర్తి కాన్సన్ట్రేషన్ ఈ నియోజకవర్గంపై పెట్టినట్లు కనిపిస్తోంది. నిజానికి పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడు అన్న విషయాన్ని అందరికంటే ముందు పసిగట్టింది వైసీపీ నేతలు. ఏడు నెలల క్రితమే పిఠాపురంలో పయనించిన పవన్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.. దీంతో పవన్ ఇక్కడ నుంచే పోటీ చేస్తాడు అని భావించిన వైసీపీ నేతలు తగు జాగ్రత్తలు అప్పటి నుంచే తీసుకుంటున్నారని టాక్. కాకినాడ ఎంపీ అయిన వంగా గీతను పిఠాపురం నుంచి పోటీకి దింపడానికి వెనుక ఉన్న వ్యూహం కూడా అదే అంటున్నారు. పవన్ ని పిఠాపురానికే పరిమితం చేసి ఏపీవ్యాప్తంగా తిరగనివ్వకుండా అష్టదిగ్బంధనం చేయడానికి వైసీపీ స్కెచ్ లు వేస్తోంది. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ ఎంపీ మిధున్ రెడ్డి,కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాపు నేత ముద్రగడ పద్మనాభం.. ఇలా హేమాహేమీలను పిఠాపురంలో మోహరిస్తోంది వైసీపీ. ఇక పిఠాపురంలో జగన్ బస్సు యాత్ర కూడా ప్లాన్ చేస్తున్నారట. ఇక వీళ్ళందరి దాడి నుంచి తమ సామాజిక వర్గం ఓట్లతో పాటు..ఇప్పుడు బీసీ ,ఈసీల ఓట్ల మీద కూడా దృష్టి పెట్టాలి. ఉన్న కాస్త సమయం పవన్ కి పిఠాపురం లోనే సరిపోతుంది అన్న టాక్ వినిపిస్తోంది. మరి పవన్ వైసీపీ తెలివిగా పండిన పద్మవ్యూహంలో అభిమన్యుడు అవుతాడు.. అన్నీ తెలిసిన అర్జునుడై బయటికి వస్తాడో చూడాలి.













