నంధ్యాల లో గెలిచేదెవరు?
భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తెదేపా పీకమీదకు కొచ్చింది. వైకాపా ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్చుకుని మంత్రుల్ని కూడా చేసిన చంద్రబాబు, వాళ్ళతో రాజీనామాలు చేయిస్తే ఉప ఎన్నికలు రానియకుండా ,రాకుండా సైలెంట్ గా కూర్చున్నారు. రాజీనామాలు అయితే ఆపొచ్చు కానీ మరణాలని ఆపలేము కదా, పాపం భూమా నాగిరెడ్డిమరణంతో తెదేపా ఉపఎన్నిక ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారం చేతిలో ఉండడం తో చంద్రబాబు ప్రభుత్వం నంద్యాలని వరాల వానలో ముంచెత్తింది, అదికూడా మ్యానిపెస్టో లో పదాలు మారకుండా నేను (బాబు) బాద్యతగా చేస్తానని మండలం గా చెప్పినా ఓటర్లు నమ్మరని సామాజిక కులానికి చెందిన ఒక నాయకుడికి బాధ్యత అప్పగించి తెదేపా ప్రచారం చేయిస్తోంది. ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారడంతో వైకాపా కూడా సర్వ శక్తులు ఒడ్డి పోరాడుతోంది. శిల్పా మోహన్ రెడ్డికి, భూమా బ్రహ్మానంద రెడ్డికి మధ్య హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అంటే..
అధికారం చేతిలో ఉండడం, ఆ అధికారాన్ని దుర్వినియోగంచేయడానికి ఏమాత్రం సిగ్గు పడకపోవడం తో తెదేపా అన్ని అస్త్రాలూ ప్రయోగిస్తోంది. ఒక్కో వర్గానికి తాయిలాలు ప్రకటిస్తూ గ్రామాల వారీగా, బూతుల వారీగా కసరత్తు చేస్తోంది. బలిజ కులం ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు, చంద్రబాబు పవన్ ని ఉద్దానం సాకుతో అమరావతి పిలిపించుకుని పవన్ తమతోనే ఉన్నాడనే సంకేతాలు పంపారు. ఇక్కడకూ వచ్చి ప్రచారం చేస్తారని బలిజ కార్యకర్తలకు ఉత్సాహం నింపడానికి ప్రయత్నించారు అక్కడా ఇబ్బంది ఎదురయ్యింది , ఇలా తెదేపా అనేక వ్యూహాలు రచిస్తుండగా, వైకాపా మాత్రం జగన్ ప్రచారం పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. కులాలు మతాల ఆధారంగా చూస్తే ఈ ఎన్నికలో ఇరువర్గాలకి సమానఅవకాశాలు ఉన్నాయి. కానీ, శిల్పా మీద ప్రజల్లో ఉన్న సానుభూతి, చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకరిస్తోందని, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తోందని మధ్యతరగతి ప్రజల్లో ఉన్న అసంతృప్తి కారణంగా వైకాపా అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెబుతున్నారు. భూమా అఖిల ప్రియ పై రోజా చేసిన చవకబారు విమర్శలు, నంధ్యాల సభలో జగన్ చంద్రబాబు పై మాట తూలడం లాంటివి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపబోవని అంటున్నారు. ఎన్నిక కనుక సక్రమంగా జరిగితే 5కనీసం 5 వేల ఓట్ల మెజారిటీతో అయినా వైకాపా నే గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.జూదరులు కూడా శిల్పా పై 5 లక్షలు వరుకూ పందాలు కాస్తున్నారు.








