ఈ నెల 4 నుంచి కోదండరాముడి బ్రహ్మూెత్సవాలు
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం బ్రహ్మూెత్సవాలకు ముస్తాబవుతోంది. ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం రూ.550 కోట్లు కేటాయించింది. దాంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 4 నుంచి 14 వరకు బ్రహ్మూెత్సవాలు జరగనున్నాయి. కోదండరాముడి కల్యాణం 10న జరగనుంది. కల్యాణోత్సవానికి గవ్నరర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు రానున్నారు. ఇందుకోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. విద్యుదీపాల అలంకరణకు కోటి రూపాయలు వెచ్చిస్తున్నారు. స్వాగత తోరణాలకే 50 లక్షలు కేటాయించారు. కల్యాణ మండపం, ఇతరత్రా పనులనూ ఘనంగా చేపట్టనున్నారు. జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.













