సీఎం చంద్రబాబు నివాసంలో వినాయకచవితి వేడుకలు
వినాయకచవితి (Vinayaka Chavithi) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాసంలో పూజలు నిర్వహించారు. సతీమణి భువనేశ్వరి ( Bhuvaneswari), మనవడు దేవాంశ్ ( Devansh), కుటుంబసభ్యులతో కలిసి సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి నిర్వహించిన గణనాథుడి పూజ ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందన్నారు. గణపతి జ్ఞానానికి, వివేకానికి, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా వినాయక పూజతో ప్రారంభించడం మన సంప్రదాయం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే చవితి వేడుకలు మనకు సామాజిక స్పహ, ఐక్యతను నేర్పిస్తాయి. సమష్ఠితత్వాన్ని బోధిస్తాయి. ఆధ్మాత్మిక చైతన్యానికి నిలువెత్తు ప్రతీకగా కలిపిస్తాయి. వినాయకుడి ఆశీస్సుతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివెరియాలి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి (Andhra Pradesh Development)కి ఎదురయ్యే విఘ్నాలన్నీ తొలగి రాష్ట్రం సుభిక్షంగా, తెలుగు జాతి వర్థిల్లేలా ఆనందంగా ఉండాలని గణనాథుడిని ప్రార్థించాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అని పేర్కొన్నారు.








