విజయవాడలో 72 అడుగుల మహాగణపతి
విజయవాడ (Vijayawada)కు చెందిన డూండీ గణేశ్ సేవా సమితి (Dundi Ganesh Seva Samiti) ఆధ్వర్యంలో లేబరుకాలనీ మైదానంలో 72 అడుగుల పర్యావరణహిత శ్రీపంచముఖ వరసిద్ధి మహాగణపతి (Maha Ganapati) విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన వినాయకుడి ఆగమన కార్యక్రమంలో మంత్రి సవిత ( Minister Savitha) హాజరై, మహిళలతో కలిసి కోలాటం ఆడారు.








