ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు అభినందనలు
ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు (BRICS Summit)ను భారత్ విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కీలక మార్పులు చోటు చేసుకుంటున్న సమయంలో ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం భారత్ (India) సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం వంటి అంశాలపై ఢిల్లీ డిక్లరేషన్ (Delhi Declaration) దృష్టి పెట్టడం కీలక పరిణామం. భిన్న అభిప్రాయాలు కలిగిన దేశాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, నిర్మాణాత్మక చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించే విశ్వసనీయ వేదికగా భారత్ ఎదిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్తూనే ఏకాభిప్రాయాన్ని సాధించగ సామర్థ్యం ప్రపంచ వేదికపై భారత్ ఆర్థిక బలం, ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది. ఈ చరిత్రాత్మక సదస్సును విజయవంతంగా నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi)కి అభినందనలు అని చంద్రబాబు పేర్కొన్నారు.








