సీఎం చంద్రబాబు కు దత్తాత్రేయ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ను హైదరాబాద్లోని నివాసంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ (Bandaru Dattatreya) మర్యాదపూర్వకంగా కలిశారు. అక్టోబర్ 22న జరిగే అలయ్ బలయ్ (Alai Balai) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆహ్వానించారు. అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, వివిధ రాజకీయ, సామాజిక వర్గాల మధ్య స్నేహం, సోదరభావం, ఐక్యతను పెంపొందించే వేదికగా ఈ కార్యక్రమం కొనసాగుతోందని దత్తాత్రేయ తెలిపారు. తన ఆహ్వాన్ని సాదరంగా స్వీకరించిన చంద్రబాబు, ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, తెలుగు ప్రజల ఐక్యత, పరస్పర సహకారం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు.








