మరో చరిత్ర సృష్టించిన విజయవాడ ఎయిర్ పోర్టు
అమరావతి రాజధాని ప్రాంతంలో తలమానికంగా ఉన్న విజయవాడ ఎయిర్‌పోర్టు ఈ ఏడాది మరో చరిత్ర సృష్టించింది. దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన ఎయిర్‌పోర్టులలో విజయవాడ సరికొత్త చరిత్రను సృష్టించింది. అర్థ సంవత్సర ఫలితాల్లోనే దేశంలోని మెట్రోపాలిటన్ ఎయిర్‌పోర్టులన్నింటినీ పక్కన పెట్టి అగ్రపథంలోకి దూసుకువెళ్లిన విజయవాడ ఎయిర్‌పోర్టు 2016-17 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 61శాతం వృద్ధిని సాధించింది. అంతర్గత సమస్యలతో ఎయిర్‌కోస్తా, స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థలు విమాన సర్వీసులను కొన్నింటిని రద్దు చేసుకోవటం వల్ల కిందటేడాది సాధించిన 73 శాతం వృద్ధిని అందుకోలేనప్పటికీ, ప్రయాణికులపరంగా, మొత్తం విమాన రాకపోకల పరంగా, ఫ్లైట్స్ మూవ్మెంట్ ప్రకారం చూసినా 2015-16 ఆర్థిక సంవత్సరం కంటే అనూహ్యంగా ఎగబాకటం విశేషం.













