భక్తి ఒక మతం కాదు – వెంకయ్య
వైద్య వృత్తి ఒక మిషన్ అని, కమిషన్ కాదని ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు అన్నారు. రూయా వైద్య విద్యార్థులతో వెంకయ్యనాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య వృత్తి పవిత్రమైందని, ఈ వృత్తిని ఎంచుకున్న విద్యార్థులు అభినందనీయులని అన్నారు. భక్తి ఒక మతం కాదని, కేవలం నమ్మకమని, అది దేశ సంపద అని ఆయన అన్నారు. దేశం శక్తివంతంగా ఉండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆయన చెప్పారు.








