ఈ నెల 29న అమరావతిలో వెంకయ్య పర్యటన
ఈ నెల 29న విజయవాడలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ముప్పవరపు వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. వెన్యూ ఫంక్షన్హాల్లో సన్నిహితులు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొనున్నారు. మధ్యాహ్నం స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమాలకు వెంకయ్య హాజరవుతారు. అదే రోజు సాయంత్రం ఉపాధ్యయ సంఘాలు ఏర్పాటు చేసిన సన్మాన సభలో వెంకయ్య నాయుడు పాల్గొంటారు.








