వైసీపీ లో కి వంగవీటి ఎంట్రీ..
తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వంగవీటి నరేంద్ర వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి నరేంద్రాను జగన్ సాధారంగా తమ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన తర్వాత వంగవీటి నరేంద్ర కూటమిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అతను తీవ్రంగా విమర్శలు కురిపించారు. వంగవీటి కుటుంబానికి.. రంగా అభిమానులకి తెలుగుదేశం పార్టీ బద్ధ శత్రువే అని ఆయన స్పష్టం చేశారు. వంగవీటి రంగా హత్యకు కారణమైన టీడీపీ తో పవన్ పెట్టుకున్న పొత్తుపై తన నిరసన వ్యక్తం చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని వంగవీటి రంగా హత్య కేసును నీరు కార్చారు అని చంద్రబాబుపై మండిపడ్డారు.వైఎస్ఆర్ కుటుంబంతో తమ కుటుంబానికి గత నాలుగు దశాబ్దాలుగా సంబంధాలు ఉన్నాయి అని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రజల కోసం కాదు.. రాజకీయ స్వార్థం కోసం.. అందుకే బయటకు వచ్చాను అని నరేంద్ర అన్నారు. కాపుల అమాయకులు కాదని.. పవన్ కళ్యాణ్ ను ఇక నమ్మేది లేదని.. విజయవాడ ఈస్ట్ లో వైసీపీ జెండా ఎగరడం కన్ఫామ్ అని వంగవీటి నరేంద్ర అన్నారు.













