చంద్రబాబు నాయుడుకు యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్ పురస్కారం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరో ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ పురస్కారం లభించింది. యు.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యు.ఎస్.ఐ.బి.సి) ఆయనకు ‘ట్రాన్స్ఫోర్మెటివ్ ఛీఫ్ మినిస్టర్’ పురస్కారాన్ని ప్రకటించింది. మే 8 తేదీన కాలిఫోర్నియాలో జరగనున్న రెండో వార్షిక పశ్చిమ తీర సదస్సు (సెకండ్ యాన్యువల్ వెస్ట్ కోస్ట్ సమ్మిట్)లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకరణ తర్వాత కీలకోపన్యాసం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబును యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ ఆహ్వానించారు.













