కేంద్రమంత్రికి సీఎం చంద్రబాబు విందు
కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. తన నివాసానికి వచ్చిన కేంద్రమంత్రికి చంద్రబాబు స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లారు. అల్పాహారం అనంతరం ఎయిమ్స్ నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులపై నడ్డాతో చంద్రబాబు చర్చించారు. ఈ చర్చలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఇతర వైద్యాధికారులు పాల్గొన్నారు.








