పల్లెల్లో భూగర్భ డ్రైనేజీ : నారా లోకేశ్
రాష్ట్రంలో ఈ డిసెంబర్ చివరికి 10 వేల కిలోమీటర్లమేర భూగర్భ డ్రైనేజీ నిర్మించనున్నట్టు రాష్ట్ర పంచాయితీరాజ్ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో పంచాయితీరాజ్, ఉపాధిహామీ పథకం అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదు వేలకంటే ఎక్కువ జనాభావున్న గ్రామాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన గ్రామాలు, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక వివరాలను కలెక్టర్ల నుంచి సేకరించాలని ఆదేశించారు. 2600 కోట్ల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.








